హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మళ్లీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని కార్కర్దూమా కోర్టు కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ 4 సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.