హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చర్చిలో ఉద్రిక్తత.. గేట్లు మూత..!

KDP: ప్రొద్దుటూరు లోని స్థానిక విజయనగరం వీధిలోని చర్చిలో ఆదివారం ప్రార్థనల సమయంలో పాత, కొత్త కమిటీల మధ్య గొడవ జరిగింది. దాంతో పోలీసుల జోక్యం చేసుకొని చర్చి గేట్లను మూయించారు. రెండు వర్గాలకు చెందిన చర్చి ఫాదర్లను, కమిటీ సభ్యులను స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చర్చిలో రెండు వర్గాల మధ్య గొడవతో ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.