హైదరాబాద్: 28°C
వార్తలు

జననాల రేటు పడిపోవడంపై మస్క్ ఆందోళన

భారత్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్‌లో జననాల రేటు రీప్లేస్‌మెంట్ కంటే కిందకు పడిపోతోందని అన్నారు. అత్యంత విద్యావంతులు ఉన్న దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.