హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 8 నుంచి కేయూ పీజీ పరీక్షలు

WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. MA, MCOM, MSC తదితర కోర్సులకు చెందిన విద్యార్థులు 31 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. మొత్తం 3,852 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.