హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన చర్చిని ప్రారంభించిన ఎంపీ

KDP: తొండూరు మండలం ఇనగలూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన టీసీసీ చర్చిని ఆదివారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన పాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన గ్రామస్థులను ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.