హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: ఎమ్మెల్యే

W.G: వయసు పెరిగే కొద్దీ శారీరకంగా మానసికంగా వచ్చే సమస్యలను అధిగమించడానికి యోగా ప్రయోజనం చేకూర్చుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం తణుకు 2 వార్డు యోగ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.