హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా మాచవరం బోనాల ఉత్సవాలు

BPT: మాచవరంలోని బస్టాండ్ సెంటర్‌లో గ్రామ బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు సూర్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బొడ్రాయి ఆవరణలో మామిడి తోరణాలు కట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. కనక తప్పెట్ల చప్పుళ్లతో గ్రామంలో వైభవంగా ఊరేగింపు చేపట్టారు. అనంతరం గ్రామస్థులు బొడ్రాయికి జలాభిషేకం చేయనున్నారు.