హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీజేపీపై బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పరోక్ష విమర్శలు చేశారు. భారత యువతను డిజిటల్ ప్రచారాలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలను దేశం సహించదని అన్నారు. విదేశాల్లో కూర్చోని భారత యువతను ఆడించలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.