హైదరాబాద్: 28°C
వార్తలు

నారాయణపేట ఆర్టీసీ డీఎం బదిలీ

నారాయణపేట ఆర్టీసీ DM టి.లావణ్య బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా RM కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్స్ విభాగం నుంచి పదోన్నతిపై 2024 ఆగస్టు 24న ఆమె ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 21 నెలల పాటు విధులు నిర్వహించిన ఆమె, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా HYDలోని హయత్ నగర్-1 డిపోకు బదిలీపై వెళ్తున్నారు. ఆమె స్థానంలో డీఎన్ రాజన్‌ను నారాయణపేట డీఎంగా కేటాయించారు.