హైదరాబాద్: 28°C
వార్తలు

పక్షుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – ఎఫ్తార్టీ రవికిరణ్

MHBD: ప్రకృతి, పక్షుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్తార్టీ రవికిరణ్ అన్నారు. శనివారం అటవీ వారోత్సవాలను పురస్కరించుకుని బయ్యారం మండలంలోని తులారం ప్రాజెక్టు వద్ద బర్డ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పక్షి వైవిధ్యం, సహజ వారసత్వం, చిత్తడి నేలలు, జీవవైవిధ్యం పరిరక్షణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.