నాగర్‌కర్నూల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, రవాణా సౌకర్యాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పాఠశాలల పునఃప్రారంభం, మహిళల తరలింపు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వార్తలు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు: కలెక్టర్


