కర్నూలులోని గాంధీనగర్ VRO మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై శనివారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలు, తీవ్ర వెన్నునొప్పి కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విధుల్లో అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
వార్తలు
VRO మహమ్మద్ హుస్సేన్ మృతిపై విచారణ: కలెక్టర్


