హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేఐకి అవమానం.. భారత హైకమిషన్ ఖండన

లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగిస్తుండగా కొందరు భారతీయులు అడ్డు తగిలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యూకేలోని భారత హైకమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తుల ప్రవర్తనను అనుచితమైనదిగా అభివర్ణించింది. 'ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. అయితే వాటిని మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యక్తపరచాలి. ఇలా వ్యవహరించడం సరికాదు' అని పేర్కొంది.