హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వదంతులపై NTA సీరియస్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పేపర్ సైతం లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలను NTA ఖండించింది. SMలో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని తెలిపింది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నీట్‌ను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.