బీహార్ మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ నితీష్ కుమార్‌పై జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. మహిళల ఓట్లను రూ.10 వేలతో కొనుగోలు చేసి గెలిచారంటూ ఆరోపించారు. ఎన్నికలకు ముందే మహిళల ఓట్లను డబ్బుతో ప్రభావితం చేశారని అన్నారు. ఈ అంశంపై జనసురాజ్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
వార్తలు
రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు: పీకే


