హైదరాబాద్: 28°C
వార్తలు

'చెత్త బుట్టలను వెంటనే పంపిణీ చేయాలి'

ASR: గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్లాస్టిక్ చెత్త బుట్టలను మూడేళ్లుగా చింతపల్లి మండలం కోరుకొండ-2 సచివాలయంలోనే ఉంచి ప్రజలకు పంపిణీ చేయలేదని సీపీఎం చింతపల్లి మండల కార్యదర్శి ధనుంజయ్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను వసూలు చేస్తూ, చెత్త బుట్టలు మాత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. చెత్త బుట్టలను వెంటనే ప్రతి కుటుంబానికి పంపిణీ చేయాలన్నారు.