హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎస్పీ కఠిన చర్యలు

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. ఐదు నెలల్లో 3,732 ఓవర్ స్పీడ్, 2,914 హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన, 863 సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించారు. అలాగే 3,803 డ్రంకెన్ డ్రైవింగ్, 7,244 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.