హైదరాబాద్: 28°C
వార్తలు

ములుగులో మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తాం: లక్ష్మణ్ బాబు

MLG: రాబోయే రోజుల్లో ములుగు గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గోవిందరావుపేట మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్నారు.