BHPL: మొగుళ్లపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఎక్స్‌రే శిబిరం నిర్వహించారు. 80 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేయగా 20 అనుమానిత టీబీ కేసులను గుర్తించారు. వారికి కఫ పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఉచిత చికిత్స అందించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ నవత తెలిపారు. శిబిరంలో 122 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
వార్తలు
టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా ఎక్స్‌రే శిబిరం


