హైదరాబాద్: 28°C
వార్తలు

రామప్ప శిల్ప వైభవానికి ముగ్ధులైన జపాన్ దంపతులు

MLG: జపాన్ దేశానికి చెందిన నాకాలిబోర్ షిగా దంపతులు శనివారం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గైడ్ విజయ్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశిష్టతలను వివరించారు. దేవాలయంలోని అద్భుత శిల్ప సంపద, కళాత్మక నిర్మాణాన్ని ఆసక్తిగా తిలకించిన వారు రామప్ప శిల్ప సౌందర్యానికి మంత్రముగ్ధులై ప్రశంసలు కురిపించారు.