హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ

NGKL: కల్వకుర్తి పట్టణంలో ఉచితంగా నిర్వహిస్తున్న కానిస్టేబుల్, ఎస్సై నిరుద్యోగులకు ఐక్యత ఫౌండేషన్ ఛైర్మెన్, కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి శనివారం ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్, శ్రీపతి, శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు.