హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా, ఇరాన్‌లకు కొరియర్‌గా పాక్: నరవణె

అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె విమర్శించారు. పాక్ కేవలం ఒక 'కొరియర్ సర్వీస్'గా వ్యవహరిస్తోందని అన్నారు. అలాగే, ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన ఒడుదొడుకులపై ఆయన స్పందించారు. 'ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాల ప్రభావం తప్పక మనపై ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడుదొడుకులకైనా సిద్ధంగా ఉండాలి' అని తెలిపారు.