హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓడిపోయి బాధలో ఉంటే.. చప్పట్లు కొట్టమన్నారు'

బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి అనంతరం మమతా బెనర్జీ సమావేశం నిర్వహించారని టీఎంసీ రెబల్ నేత రితబ్రత పేర్కొన్నారు. పార్టీ కోసం అభిషేక్ చేసిన కృషికి నిలబడి చప్పట్లు కొట్టాలని సమావేశానికి హాజరైన నేతలకు మమత సూచించారని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న తమను ఈ చర్య మరింత బాధించిందని అన్నారు. టీఎంసీలో అవినీతి బాగా పెరిగిపోయిందని.. దానిని ప్రక్షాళించాల్సిన సమయం వచ్చిందన్నారు.