హైదరాబాద్: 28°C
వార్తలు

అభిషేక్ వల్లే టీఎంసీలో చీలిక: రితబ్రత బెనర్జీ

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై టీఎంసీ రెబల్ నేత రితబ్రత బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. అభిషేక్ వల్లే పార్టీలో అంతర్గత తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని.. అయితే, తమపై అభిషేక్ పెత్తనాన్ని మాత్రం ఒప్పకోబోమని తెలిపారు. పార్టీ కోసం ఏమీ చేయకపోయినా దీదీ ఆయనకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టారని రితబ్రత బెనర్జీ విమర్శించారు.