హైదరాబాద్: 28°C
వార్తలు

నవచేతన యాప్‌పై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన

KRNL: 0–6 సంవత్సరాల చిన్నారుల ఆరోగ్య, అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించేందుకు నవచేతన యాప్ ద్వారా నిర్వహించే ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్‌పై శనివారం పెద్దకడబూరులో అంగన్వాడీ కార్యకర్తలకు మండల స్థాయి శిక్షణ నిర్వహించారు. సీడీపీవో ఎస్. రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ర యాప్ వినియోగాన్ని వివరించారు.