హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీఎంఆర్డీఏ ద్వారా రూ.10 కోట్లు కేటాయించినట్లు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. రైతుబజార్ కూడలి వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. రహదారులు, కాలువలు, కల్వర్టులు, విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటు చేస్తామన్నారు.