హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. 2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురైనట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడం, వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని తెలిపారు.