హైదరాబాద్: 28°C
వార్తలు

అట్లూరు తహసీల్దార్‌గా ఇజాజ్ అహ్మద్ బాధ్యతలు

అట్లూరు మండల నూతన తహశీల్దార్ ఇజాజ్ అహ్మద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.