KDP: పెన్నా నది పరివాహక ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని CI వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు పెన్నానదీ తీర ప్రాంతాలలో ఇసుక రవాణా చేయకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అనుమతులు ఇచ్చిన చోట డంపింగ్ ఇసుక మాత్రమే రవాణా చేసుకోవాలని సూచించారు.
వార్తలు
అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు: CI


