హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొత్తఇండ్లలో తాగునీటి సమస్యకు చెక్

అన్నమయ్య: మదనపల్లి మండలం కొత్తఇండ్ల పంచాయతీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు నూతన బోర్‌ను ఏర్పాటు చేశారు. శనివారం మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి తాగునీటి బోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందుంటుందన్నారు.