హైదరాబాద్: 28°C
వార్తలు

తంబళ్లపల్లె ఎమ్మెల్యేకు టీడీపీ నేత సవాల్

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్ తాజ్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి మూలవిరాట్ తరలించలేదని ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.