గల్ఫ్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ప్రధాని మోదీ తన ‘ఆర్థిక సలహా మండలి’ సభ్యులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతున్న వేళ, భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇందులో చర్చిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రత్యామ్నాయ వ్యూహాలను సిద్ధం చేయడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
వార్తలు
ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం


