AKP: చోడవరం పంచాయతీ ఐటీఐ, దుర్గా కాలనీల్లో మురుగునీరు రోడ్లపైకి చేరడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. అధికారులు స్పందించి కాలువలు నిర్మించకపోతే శుక్రవారం కలెక్టర్ వద్ద నిరసన తెలుపుతామన్నారు.
వార్తలు
'కాలువలు నిర్మించకుంటే కలెక్టరేట్ ముట్టడి'


