హైదరాబాద్: 28°C
వార్తలు

వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.