హూడెడ్ పిటోహుయ్ .. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి. ఇది న్యూగినియా అడవుల్లో కనిపిస్తుంది. దీని చర్మం, ఈకల్లో 'బాట్రాచోటాక్సిన్' అనే ప్రాణాంతక నరాల విషం ఉంటుంది. దీన్ని కేవలం తాకినా లేదా పట్టుకున్నా ఒళ్లు మొద్దుబారిపోవడం, మంటలు పుట్టడం జరుగుతుంది. విషపూరిత కీటకాలను తినడం వల్లే ఈ పక్షికి ఈ విషం అబ్బుతుంది. శాస్త్రవేత్తలు దీన్ని అత్యంత ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు.
వార్తలు
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షి


