హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రోన్ కెమెరాల వినియోగంపై అవగాహన

ELR: దెందులూరు బాల సదన్‌కు చెందిన 23 మంది బాలికలకు పోలీసుల పనితీరు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రోన్ కెమెరాల వినియోగంపై ఎస్పీ ప్రతాప్ కిషోర్ శనివారం అవగాహన కల్పించారు. వ్యక్తిగత భద్రతలో భాగంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ ఆపదలో డయల్ 112 ద్వారా పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో సూచించారు. ఉన్నత జీవితానికి చదువే పునాదని, అంకితభావంతో చదవాలన్నారు.