నైరుతి రుతుపవనాల రాకతో కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కోజికోడ్‌లోని హల్వాబజార్ ప్రాంతంలో ఓ ప్రహరీ కుప్పకూలింది. దీంతో నిలిపి ఉన్న రెండు బైకులు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
వార్తలు
రుతుపవనాల రాక.. కేరళంలో భారీ వర్షాలు


