KDP: సిద్ధవటం(M)భాకరాపేట గ్రామ సచివాలయాన్ని స్పెషల్ ఆఫీసర్ విజయకుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రికార్డుల నిర్వహణ,హాజరు నమోదు తదితర అంశాలను పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో సమావేశమైన ఆయన ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. టీడీపీ యువ నాయకులు ఆయనను సత్కరించారు.
వార్తలు
సచివాలయాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్


