ATP: శింగనమల మండలం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ, రాయదుర్గం తహసీల్దార్‌గా పదోన్నతిపై వెళుతున్న సూర్య ప్రతాప్ యాదవ్‌ను రెవిన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. మండల తహసీల్దార్ శేషారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తోటి ఉద్యోగులు ఆయన సేవలను కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
తహసీల్దార్ సూర్య ప్రతాప్ యాదవ్ కు సన్మానం


