PPM: జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట మలుపు సమీపంలో ఇవాళ ఉదయం ఓ లారీ బోల్తా పడింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. మామిడికాయల లోడు మొత్తం రోడ్డు పక్కన పడిపోయిందని వెల్లడించారు.
వార్తలు
గవరమ్మపేట మలుపు వద్ద లారీ బోల్తా


