హైదరాబాద్: 28°C
వార్తలు

4వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని 4వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు శనివారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు చొరవతో నూతన బోరింగ్ ఏర్పాటు చేశారు. వార్డ్ సభ్యుడు ఎంపెల్లిరాజు ఆధ్వర్యంలో పనులుపూర్తి కాగా, నీటిసమస్య తీరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన సర్పంచ్, వార్డ్ సభ్యుడికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.