హైదరాబాద్: 28°C
వార్తలు

వంటమనిషి నిర్లక్ష్యం వల్లే.. ఢిల్లీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా, వంటమనిషి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిబంధనల ఉల్లంఘనలతో పాటు వంటమనిషి అజాగ్రత్తే ఈ ఘోరానికి కారణమని నిర్ధారించిన ఢిల్లీ పోలీసులు, శనివారం అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.