హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరగనున్న మద్యం ధరలు?

TG: ఈనెల 15 నుంచి మద్యం ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. తయారీ, రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఫుల్ బాటిల్‌పై సాధారణ బ్రాండ్లకు రూ.80, ప్రీమియంకు రూ.90, కాస్ట్‌లీ బ్రాండ్లకు రూ.120 వరకు పెరగొచ్చు. అయితే బీర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీనికి సంబంధించిన ఫైల్ రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనుంది.