హైదరాబాద్: 28°C
వార్తలు

మిడ్జిల్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మిడ్జిల్ మండల కేంద్రంలో 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. MBNR మండలం మాచన్ పల్లి 19.8, కోయిలకొండ మండలం పారుపల్లి 7.5, మిడ్జిల్ మండలం దోనూరు 5.3, రాజాపూర్ 3.8, హన్వాడ 3.3, మహమ్మదాబాద్ 2.5, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.