హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ కూలీ పై దాడి... బంధువులు ఆందోళన

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామం అప్పన్నపేటలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న తాళ్ళ దుర్గ పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె గాయపడగా, స్థానికులు ఆమెను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.