KDP: పులివెందుల మున్సిపాలిటీ ఉల్లిమెల్లకి చెందిన శివలక్ష్మి తన భర్త గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. భూ వివాదం విషయంలో స్టేషనుకు పిలిచి రెండు రోజులపాటు ఉంచడంతోపాటు సీఐ శ్రీరామ్ బెల్టుతో కొట్టి గాయపరిచారని మీడియా ముందు తెలిపారు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ప్రశ్నించినందుకు బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు.
వార్తలు
భర్తపై పోలీసుల దాడి చేశారంటూ మహిళ ఆరోపణ


