హైదరాబాద్: 28°C
వార్తలు

సినిమా చూపిస్తూ ఆపరేషన్

మెదడులో గడ్డతో బాధపడుతున్న ఓ మహిళకు సినిమా చూపిస్తూ.. ఆపరేషన్ చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పొన్నూరుకు చెందిన కోటేశ్వరమ్మకు మత్తు ఇవ్వకుండా, ఆమెకు ఇష్టమైన పవన్‌ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా చూపిస్తూ న్యూరోసర్జన్ డా. అరుణ్‌కుమార్ బృందం ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వెద్యులు తెలిపారు.