హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,468 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.48 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.