హైదరాబాద్: 28°C
వార్తలు

అద్దంకిలో ఉదయాన్నే పర్యటించిన కలెక్టర్

ప్రకాశం: మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో శనివారం వేకువజామునే ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆయన స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని, పారిశుధ్య నిర్వహణను. తాగునీటి సరఫరా తీరును కలెక్టర్‌ తనిఖీ చేశారు.