హైదరాబాద్: 28°C
వార్తలు

కారంచేడు నూతన ఎమ్మార్వోగా మాధవి లత

BPT: కారంచేడు మండల నూతన తహసీల్దార్ (MRO)గా ఎం. మాధవి లత బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పర్చూరులో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆమె, పదోన్నతి (ప్రమోషన్) పొంది కారంచేడుకు నియమితులయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మాధవి లత పేర్కొన్నారు.